My Telugu NRI

Mobile Scrollable Menu
- Business - Latest News

గోల్డ్‌ ప్రియులకు శుభవార్త

గోల్డ్‌ ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు  కాస్త బ్రేక్‌ పడింది. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1860 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 4 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,1,860 తగ్గి రూ.1,22,290కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ,1,700 పతనమై రూ.1,12,100 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో […]

గోల్డ్‌ ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు  కాస్త బ్రేక్‌ పడింది. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1860 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 4 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,1,860 తగ్గి రూ.1,22,290కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ,1,700 పతనమై రూ.1,12,100 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,22,440కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,200గా పలుకుతోంది. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,100గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,290గా ఉంది.

వెండి ధర మాత్రం ఆల్‌టైమ్‌ హైకి చేరింది. ఏకంగా రూ.2 లక్షల చేరువలోకి వెళ్లింది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి రూ.3,000 పెరిగి ధర రూ.1,80,000కి ఎగబాకింది. ఐదు రోజుల్లోనే కిలో వెండి ధర రూ.15 వేలు పెరగడం గమనార్హం. రానున్న రోజుల్లో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.