కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో ప్రజానాయకుడు, ప్రజలకు సేవకుడు గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది. గుమ్మడి నర్సయ్య పేరునే టైటిల్‌గా పెట్టిన ఈ బయోపిక్‌కు పరమేశ్వర్ దర్శకత్వం వహిస్తుండగా, ఎన్. సురేష్ రెడ్డి ప్రవళ్లిక బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు భవ్యంగా జరిగాయి. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కూనేని సాంబశివరావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈవెంట్‌లో శివ రాజ్‌కుమార్ చేసిన స్పీచ్ అందరి మనసును దోచుకుంది. మంచి మనిషి జీవితాన్ని పెద్ద తెరపై చూపించే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు తెలిపారు.


