యంగ్ హీరో నరేష్ అగస్త్య, అందాల నటి ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గుర్రం పాపిరెడ్డి. మురళిమనోహర్ దర్శకత్వం. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తుంటే ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవిలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో జరిగే గందరగోళం, అనూహ్య మలుపులు, మరియు హాస్యాన్ని మిళితం చేసి ఈ సినిమాను రూపొందించారు. ట్రైలర్లో లెజెండరీ నటుడు బ్రహ్మానందం న్యాయమూర్తి పాత్రలో కనిపించడం, అలాగే తమిళ నటుడు యోగి బాబు కూడా కీలక పాత్ర పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.


