పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాను భారత్కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టు కు తెలియజేశారు. తాను బ్రిటన్ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్కు ఎప్పుడు తిరిగి వస్తాననేది కచ్చితంగా చెప్పలేనని మాల్యా పేర్కొన్నారు. ఈ మేరకు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ బాంబే కోర్టులో ఒక స్టేట్మెంట్ను సబ్మిట్ చేశారు. మాల్యా దగ్గర యాక్టివ్ ఇండియన్ పాస్పోర్టు లేదని, అదేవిధంగా దేశం దాటి వెళ్లకుండా ఇంగ్లండ్, వేల్స్ కోర్టుల ఆంక్షలు ఉన్నాయని ఆ సబ్మిషన్లో అమిత్ దేశాయ్ పేర్కొన్నారు.


