My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

నన్ను టార్గెట్‌ చేస్తే దేశంలో మీ పునాదులు కదులుతాయ్‌ : మమతా బెనర్జీ

తనతో రాజకీయంగా పోరాడే దమ్ము బీజేపీ  కి లేదని, తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యంకాదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  అన్నారు. బెంగాల్‌లో తనకు సవాల్‌ విసరాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పునాదులను కదిలిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కు వ్యతిరేకంగా బన్‌గావ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ఎన్నికల సంఘం ఏ మాత్రం నిష్పాక్షికంగా పనిచేయడం లేదని, అది బీజేపీ కమిషన్‌గా మారిందని మమత ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ […]

తనతో రాజకీయంగా పోరాడే దమ్ము బీజేపీ  కి లేదని, తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యంకాదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  అన్నారు. బెంగాల్‌లో తనకు సవాల్‌ విసరాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పునాదులను కదిలిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కు వ్యతిరేకంగా బన్‌గావ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.

ఎన్నికల సంఘం ఏ మాత్రం నిష్పాక్షికంగా పనిచేయడం లేదని, అది బీజేపీ కమిషన్‌గా మారిందని మమత ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ కారణంగానే బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ విధంగా వచ్చాయని, అక్కడ బీజేపీ ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని అన్నారు. ఒకవేళ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను తొలగించడమే ఎస్‌ఐఆర్‌ లక్ష్యమైతే,  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్  సర్కారు రాష్ట్రాల్లో చొరబాటుదారులు ఉన్నట్లు ఆ పార్టీ అంగీకరిస్తోందా? అని ప్రశ్నించారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా బయటకు వచ్చినప్పుడు ఈసీ, బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియను రెండుమూడేళ్లపాటు నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పారు. బీజేపీ తనను ఇరుకున పెట్టలేదని, తనతో ఆటలాడొద్దని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.