జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేశారు. జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పు చేర్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు సమావేశంలో 927 అభ్యంతరాలు, సూచనలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకే గూడూరును కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్, మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడు మండలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 31న తుది నోటిఫికేషన్ను ఏపీ సర్కార్ జారీ చేయనుంది.


