పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లో మరో రెండు భారత వీసా కేంద్రాలు మూతపడ్డాయి. రాజ్‌షాహి , ఖుల్నా లోని వీసా కేంద్రాలను భారత్ మూసేసింది. బంగ్లాదేశ్ నాయకులు, అసాంఘిక శక్తుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా వీసా కేంద్రాలను భారత్ మూసివేసింది. భద్రతా పరిస్థితుల దృష్ట్యా రాజ్‌షాహి, ఖుల్నాలోని వీసా కేంద్రాలను మూసివేస్తున్నాం. వీసా దరఖాస్తు కోసం ఈరోజు బుక్ అయిన అపాయింట్‌మెంట్ స్లాట్‌లను మరో తేదీకి మారుస్తాం అని భారత్ ప్రకటించింది. రాజధాని ఢాకాలోని వీసా కేంద్రాన్ని ఇప్పటికే భారత్ మూసివేసిన విషయం తెలిసిందే.


