దేశీయ రక్షణ సాంకేతికతలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. భారతక్ష రక్షణ పరిశోధనా సంస్థ యుద్ధవిమాన పైలట్ ఎస్కేప్ సిస్టమ్‌కు సంబంధించిన హై-స్పీడ్ రాకెట్-స్లెడ్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పరీక్ష స్వదేశీ యుద్ధవిమాన రక్షణ సాంకేతికతలో ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు.
ఈ టెస్ట్ చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లాబొరేటరీ లో ఉన్న రైల్-ట్రాక్ రాకెట్ స్లెడ్ ఫెసిలిటీలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో నిర్వహించింది. ఈ విజయంతో పైలట్ ఎజెక్షన్ సిస్టమ్‌ను పూర్తిగా పరీక్షించగలిగే సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ ఎస్కేప్ సిస్టమ్‌ను నియంత్రిత వేగంతో పరీక్షించారు. కానోపీ సెవెరెన్స్, ఎజెక్షన్ సీక్వెన్స్, ఎయిర్‌క్రూ రికవరీ ప్రక్రియ వంటి అన్ని దశలు విజయవంతమయయాయి. ఈ టెస్ట్‌ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి.


