అమెరికా లోని కాలిఫోర్నియా లో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. అమెరికాలోని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఈ విషయాన్ని వెల్లడించింది. వారిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది. కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతున్నట్లు, మరికొందరు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్‌లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 30 మంది భారత్‌కు చెందినవారు కాగా, మిగిలినవారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే మొదలైన దేశాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు.


