టాలెంటెడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా, ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా వస్తున్న తాజా చిత్రం గాయపడ్డ సింహం. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, సప్త అశ్వ మీడియా వర్క్‌స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే, అమెరికా వెళదాం అనుకున్న యువకుడికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వలన ఎలాంటి పరిస్థితి వచ్చింది అనేది సినిమా కథ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 09న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తరుణ్ భాస్కర్ గత సినిమాల కంటే భిన్నంగా ఇందులో కనిపించబోతున్నారని సమాచారం.


