ఎట్టకేలకు మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కామన్, కానీ, దాన్ని నిలబెట్టుకొనేవారు చాలా తక్కువమంది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ లో విజయ్ ఉ రష్మిక చాలా సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. విజయ్ ఇంట్లోనే కేవలం అతికొద్దిమంది బంధుమిత్రుల మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ తరువాత కూడా విజయ్, రష్మిక దాని గురించి బయటపెట్టలేదు. అయితే వీరిద్దరూ తమ పర్సనల్ విషయాలను మీడియాకు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ జంట పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


