భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మెన్ వీ నారాయణన్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. అమెరికాకు చెందిన నాసాతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి ప్రయోగించిన నిసార్ ఉపగ్రహం నవంబర్ 7వ తేదీ నుంచి ఆపరేషన్‌లోకి వస్తుందన్నారు. నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ రేడార్(ఎన్ఐఎస్ఏఆర్) అత్యంత ఖరీదైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. భూ గ్రహంపై ఉన్న మంచు కేంద్రాలను ప్రతి 12 రోజులకు రెండుసార్లు మానిటర్ చేసే సామర్థ్యం ఆ ఉపగ్రహానికి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
జూలై 30వ తేదీన జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆ శాటిలైట్‌ను ప్రయోగించారు. నిసార్ బరువు సుమారు 2400 కేజీలు. డేటా సమీకరణ పూర్తి అయ్యిందని, నవంబర్ 7వ తేదీన జరిగే భేటీలో శాటిలైట్‌ను అపరేషనల్‌గా ప్రకటించనున్నట్లు నారాయణన్ అన్నారు. ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.


