ప్రపంచ టెక్ రంగంలో అత్యంత సంపన్న సీఈవోలు ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల , సుందర్ పిచాయ్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇద్దరూ టెక్ రంగంలో భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న ఎగ్జిక్యూటివ్‌లుగా కొనసాగుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆ స్థానాన్ని వారు కోల్పోయారు. తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టి అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. హురిన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం టెక్ సీఈవోల్లో జయశ్రీ ఉల్లాల్ అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. రూ.50,170 కోట్ల నికర విలువతో ఉల్లాల్ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల రూ.9,770 కోట్ల నికర విలువతో రెండోస్థానంలో నిలవగా, రూ. 5,810 కోట్లతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఏడో స్థానాన్ని సరిపెట్టుకున్నారు.


