తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠను రేకెత్తించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై చివరికి తెరపడిరది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. వి.నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. నవంబరు 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఎన్నిక అనివార్యమైంది. నవీన్ యాద్ ఆ ఎన్నికల్లో ఎంఐఎం తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్లో చేరి, తాజాగా టికెట్ దక్కించుకున్నారు.


