My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

కే ర్యాంప్ అంటే బూతు ప‌దం కాదు.. అర్థం చెప్పిన ద‌ర్శ‌కుడు

కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం కే రాంప్. హాస్య మూవీస్ బ్యానర్‌లో వ‌స్తున్న ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మిస్తుండ‌గా,  జైన్స్ నాని ద‌ర్శ‌కుడు.  మలయాళ బ్యూటీ యుక్తి తరేజా క‌థానాయిక. ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ సినిమాకి చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోంటుంది చిత్ర‌యూనిట్. అయితే ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఇన్నిరోజులు వివాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ […]

కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం కే రాంప్. హాస్య మూవీస్ బ్యానర్‌లో వ‌స్తున్న ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మిస్తుండ‌గా,  జైన్స్ నాని ద‌ర్శ‌కుడు.  మలయాళ బ్యూటీ యుక్తి తరేజా క‌థానాయిక. ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ సినిమాకి చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోంటుంది చిత్ర‌యూనిట్. అయితే ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఇన్నిరోజులు వివాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ కె-ర్యాంప్‌  బూతు ప‌దంలా ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే తాజాగా ఈ విష‌యంపై క్లారిటీనిచ్చాడు ద‌ర్శ‌కుడు జైన్స్ నాని. కె-ర్యాంప్‌  అంటే బూతు ప‌దం కాద‌ని,  దాని అర్థం కిర‌ణ్ అబ్బ‌వ‌రం ర్యాంప్ అని తెలిపాడు. కిర‌ణ్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ స్క్రిప్ట్‌ రాశానని తెలిపాడు. కిర‌ణ్ కెరీర్‌లో ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచిపోతుంద‌ని నాని అన్నారు. మ‌రోవైపు ఈ సినిమాపై కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాట్లాడుతూ  థియేటర్‌లో కూర్చుని నవ్వుకునే వైబ్‌ ఉన్న సినిమా ఇది. ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది ప‌క్క‌న పెడితే నాకు ద‌ర్శ‌కుడు నాని రూపంలో మంచి బ్ర‌ద‌ర్ దొరికాడు. లైఫ్‌లో నానిని ఎప్పుడు చూసిన న‌వ్వుతునే ఉంటాను. ఆడియ‌న్స్ కూడా ఈ సినిమా చూశాకా అలానే న‌వ్వుతూ ఉంటార‌ని తెలిపాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.