విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి సవితకి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. కొండపై ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను పరిశీలించారు. మంత్రి సవితకు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు దేవస్థాన అధికారులు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఏపీ ప్రజలపై కనక దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. నేటి నుంచి దర్శన టిక్కెట్లు లేకుండా భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు మంత్రి సవిత. ఏర్పాట్లు, సౌకర్యాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు.


