బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఆయన చేసిన అసాధారణ కృషిని, తెలంగాణను ప్రపంచపటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తిస్తూ, అంతర్జాతీయ వేదికలపై ఆయన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానం అందింది. సాంకేతికత, పాలన, సుస్థిర అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ప్రపంచవ్యాప్తంగా విద్యా, విధాన నిర్ణేత, వ్యాపార వేదికలపై బలమైన ముద్ర వేసింది. ఈ క్రమంలో న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ లో 2026 ఏప్రిల్ 4న జరగనున్న 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించాలని కేటీఆర్కు ఆహ్వానం అందించింది. ఈ సదస్సును నిర్వహించే విద్యార్థి విభాగం సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్ ఈ మేరకు ఆయనను ఆహ్వానించింది.


