లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ (లాట) నూతన కార్యనిర్వాహక బృందం, డైరెక్టర్ మండలి తాజాగా బాధ్యతలు చేపట్టాయి. సుధీర్ పొత్తూరి, సురేష్ బాబు అంబటి నాయకత్వంలో కార్యనిర్వాహక వర్గం, డైరెక్టర్ మండలి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని స్థానిక షిరిడీ సాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు, స్వచ్ఛంద సేవకులు, మిత్రులు హాజరై శుభాభినందనలు తెలియజేశారు.
లాట నూతన కార్యవర్గం:
అధ్యక్షులు: సుధీర్ పొత్తూరి
ఉపాధ్యక్షులు: చంద్రశేఖర్ గుత్తికొండ
కార్యదర్శి: శ్రీకాంత్ వల్లభనేని
సంయుక్త కార్యదర్శి: విష్ణు యలమంచి
కోశాధికారి: సూర్య భమిడిపాటి
సంయుక్త కోశాధికారి: సుధా రాణి దావులూరి
సభ్యులు: అరుణ మధ్యానమ్, పృథ్వీష్ కాసుల
లాట డైరెక్టర్ మండలి:
ఛైర్మన్: సురేష్ బాబు అంబటి
సభ్యులు: అలేఖ్య గరికపర్తి, భార్గవి దేవిడి, హరిబాబు నేతి, నరేంద్ర కవర్తపు, ప్రతాప్ మేథరమిట్ట, ప్రతాప్ చెరుకూరి, శ్రీకాంత్ అమినేని, సునీల్ కుమార్ మల్లెల, ఉమ కాట్రు వెంకట క్రిష్ణ బోసం, వెంకట పూసర్ల.


