ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. తాజారౌండ్‌లో తన హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో 15% వరకు ఉద్యోగుల్ని ఇంటికి పంపించేందుకు రెడీ అయ్యింది. హెచ్‌ఆర్ విభాగంతోపాటూ ఇతర విభాగాలపై కూడా లేఆఫ్స్ ప్రభావం పడనున్నట్లుంది. అమెజాన్ సీఈఓగా ఆండీ జస్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా వరుసగా ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తూనే ఉంది. సంస్థ వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా 2022లో ఏకంగా 27,000 మంది ఉద్యోగులను తొలగించింది.


