అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బిహార్ లో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు రూ.10,000 చొప్పున రూ.7,500 కోట్ల మొత్తాన్ని వాళ్ల ఖాతాలోని నేరుగా బదిలీ చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇతర మంత్రుల సమక్షంలో వర్చువల్ తరహాలో న్యూఢిల్లీ నుంచి మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాల తరుణంలో బిహార్ మహిళల సంతోషంలో భాగస్వామ్యం అవుతున్నాను. లక్షలాది మంది మహిళల ఆశీస్సులే మాకు కొండంత బలం. వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని మోదీ వర్చువల్ మీట్‌లో పేర్కొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి మహిళా యోజన పథకాన్ని ప్రారంభమిస్తున్నామని, ఈ పథకంలో ఇంతవరకూ 75 లక్షల మంది మహిళలు చేరారని, వీరందరికీ రూ.10,000 చొప్పున వారి వారి అకౌంట్లలో జమచేశామని చెప్పారు.


