తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వాటిలో ప్రధానంగా సంజయ్ కుమార్‌ను పరిశ్రమలు, ఐటి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పిఆర్ & ఆర్డి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇక సభ్యసాచి ఘోష్‌కు – ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ స్కిమ్స్ యూనిట్‌తో పాటు సిఎస్ఆర్‌గా బాధ్యతలు అందించారు. ఇక ఎం.దాన కిషోర్‌కి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ, విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్. శ్రీధర్‌కు ఐటి & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. రాహుల్ బొజ్జాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అంతేకాక బిసి వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత అందించారు. ఇ. శ్రీధర్‌కు ఇరిగేషన్ మరియు సిఎడి శాఖ కార్యదర్శిగా నియమించారు. గౌరవ్ ఉప్పల్‌ను ఫైనాన్స్ మరియు ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియమించారు. టిజిఆర్ఎసి ఇవొ డిజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.


