ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు ఆరు రోజులపాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై మంత్రి అధ్యయనం చేయనున్నారు. సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షోలకు మంత్రి లోకేష్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ ఇప్పటికే వివిధ దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయా పర్యటనలు విజయవంతమై అనేక కీలక పెట్టుబడులను రాష్ట్రానికి తీసువచ్చారు. తాజాగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు.


