My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

మంత్రి సవిత కీలక ప్రకటన … త్వరలో ఆదరణ-3

 ఆదరణ-3 పథకం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. విజయవాడ లో  ఆమె మీడియాతో మాట్లాడుతూ  త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు చెప్పారు. ఆదరణ-3 పథకం  అమలుపై బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లతో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. నకిలీ మద్యం కేసుపై కూడా మంత్రి స్పందించారు. ఈ కేసుపై వైసీపీ సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబాయి గొడ్డలిపోటు […]

 ఆదరణ-3 పథకం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. విజయవాడ లో  ఆమె మీడియాతో మాట్లాడుతూ  త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు చెప్పారు. ఆదరణ-3 పథకం  అమలుపై బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లతో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. నకిలీ మద్యం కేసుపై కూడా మంత్రి స్పందించారు. ఈ కేసుపై వైసీపీ సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబాయి గొడ్డలిపోటు పై సీబీఐ దర్యాప్తును వైసీపీ ఎందుకు కోరట్లేదని ఆమె ప్రశ్నించారు.   ఆదరణ-3 పథకం  అమలు చేయాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కుల వృత్తిదారులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలను ఎంపిక చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆదరణ-2లో రాష్ట్రస్థాయిలో పరికరాలను ఎంపిక చేసి ఆ తర్వాత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఆదరణ-3లో భాగంగా లబ్ధిదారులే తమకు కావాల్సిన పరికరాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. ఆదరణ-2  సమయంలో 90శాతం రాయితీతో పరికరాలను అందజేస్తారు. మిగిలిన 10శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఆదరణ-3లో కూడా ఇదే విధానం ఉంచనున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.