వైసీపీకి రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును కలిసి వివరణ ఇచ్చారు. చైర్మన్‌ను ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీత కలిశారు. వీరిలో అందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ వివరణ ఇచ్చారు కూడా. కానీ అంతలోనే జాకియా ఖానం మాత్రం యూటర్న్ తీసుకున్నారు. రాజీనామాకు సంబంధించి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ వద్ద వివరణ ఇచ్చాక రాజీనామాను జాకియా ఉపసంహరించుకున్నారు. తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు చైర్మన్ రాజుకు జాకియా ఖానం వివరించారు. కాగా, ఈ ఏడాది మేలో ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ పార్టీకి జాకియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 2020 జూలైలో ఎమ్మెల్సీగా జాకియాను గవర్నర్ నామినేట్ చేశారు.


