గాజాలో శాంతి స్థాపనకు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికను అంగీకరించిన హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం ముగింపునకు ఇది కీలక ముందడుగని చెప్పారు. గాజాలో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా నిర్ణయాత్మక పురోగతి సాధిస్తున్న డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని మోదీ అభినందించారు. గాజాలో శాంతి ప్రయత్నాలకు నిర్ణయాత్మక పురోగతి సాధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నా. బందీల విడుదలకు అంగీకారం కుదరడం శాంతి స్థాపనకు కీలక ముందడుగు. శాశ్వత, న్యాయమైన శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుంది అని మోదీ చెప్పారు .


