రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానం లో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ ఫస్ట్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 105 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ముకేశ్ సంపద 12 శాతం క్షీణించింది. ఇక ముకేశ్ అంబానీ తర్వాత 92 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్‌కు చెందిన సావిత్రి జిందాల్ 40 బిలియన్ డాలర్లతో మూడోస్థానంలో, టెలికం దిగ్గజం సునీల్ మిట్టల్ 34 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, టెక్ బిలియనీర్ శివ నాడార్ 33 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు. 2025 ఫోర్బ్స్ జాబితాలో 100 మంది దేశీయ కుబేరుల సంపద విలువ 9 శాతం (100 బిలియన్ డాలర్లు) పడిపోయి 1 ట్రిలియన్ డాలర్లకు చేరింది.


