తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2,582 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 1,347 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో 64 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ 717 వార్డుల్లో గెలుపొందింది. దాంతో 13 మున్సిపాలిటీలను ఆ పార్టీ దక్కించుకుంది. బీజేపీ 261 వార్డుల్లో గెలుపొందారు. స్వాతంత్ర అభ్యర్థులు 256 వార్డుల్లో విజయం సాధించారు. 38 మున్సిపాలిటీల్లో మాత్రం ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. అలాగే జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.


