టాలీవుడ్ నటుడు నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హీరోయిన్ శిరీష (సిరి లేళ్ల) తో ఆయన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు వారి వెడ్డింగ్ డేట్ కూడా ఖరారైంది., నారా రోహిత్ – శిరీష వివాహ వేడుకలు హైదరాబాద్‌లో ఐదు రోజులపాటు భారీగా జరగనున్నాయి. ఈ నెల అక్టోబర్ 25న హల్దీ వేడుకతో వివాహ సంబరాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 26న పెళ్లికొడుకు చేసే కార్యక్రమం, అక్టోబర్ 28న మెహందీ, అక్టోబర్ 29న సంగీత్ నైట్ నిర్వహించనున్నారు. ముఖ్య వేడుక అయిన పెళ్లి అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు జరుగనుంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఇప్పటికే వివాహ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.


