యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వయంభు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో, 3డ్ ఫార్మాట్లో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ క్రీస్తుశకం 985 నాటి పరాక్రమవంతుడైన యోధుడిగా కనిపిస్తున్నారు. భారీ సెట్టింగ్‌లు, అద్భుతమైన పీరియడ్ వార్ సీక్వెన్స్‌లతో కూడిన ఈ టీజర్, నిఖిల్ మేకోవర్ మరియు ఆయన యుద్ధ విన్యాసాలను అద్భుతంగా ఆవిష్కరించింది. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్ సమకూర్చారు.


