ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండు రోజుల నుంచి ఢిల్లీ ఉండగా, చర్మ సంబంధ ఎలర్జీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ ఎందుకు అంతా కాలుష్యమైందని ఆయన ప్రశ్నించారు. శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి. కానీ కాలుష్యం మాత్రం పెరిగిపోతోంది. మనం వాటి వాడకాన్ని తగ్గించలేమా? కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహం లభించాలిఅని గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శిలాజ ఇంధనాలపై ఏటా దాదాపు రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు.


