మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకరవర ప్రసాద్ చిత్రం నుంచి తాజాగా రెండో పాట విడుదల తేదీ ఖరారైంది. శశిరేఖ అనే పేరుతో రాబోతున్న ఈ రెండో పాట డిసెంబర్ 08న విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ (షైన్ స్క్రీన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


