కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును పక్కనబెట్టి కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీకి మేయర్ పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. బీజేపీ బలపడుతున్నందుకే కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని అన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి మాటిచ్చానని, కరీంనగర్‌లో బీజేపీని గెలిపించి తన హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. కరీంనగర్ ప్రజలు ఎప్పటికీ బీజేపీతోనే ఉంటారని, భవిష్యత్తులో కూడా పార్టీ విజయాలను కొనసాగిస్తుందని సంజయ్ పేర్కొన్నారు.


