శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విషాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు, మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. గాయాల పాలైన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ఇస్తామని మోడీ ప్రభుత్వం వెల్లడించింది. దురదృష్టకర ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరమని, తొక్కిసలాట తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.


