ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 16వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు ప్రధాని మోదీ. 16వ తేదీన ఉదయం 10:20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అనంతరం హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు బయలు దేరుతారు. అక్కడ నుంచి ఉదయం 11:10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కి చేరుకోనున్నారు ప్రధాని. 16వ తేదీన ఉదయం 11:45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సున్నిపెంటలో హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు బయలుదేరనున్నారు.


