మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్లి గోడలు, ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు చూసి వచ్చారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. వాటిని చూసి ఆహా ఓహో అంటూ ప్రజల్ని మోసం చేసే విధంగా డ్రామాలు ఆడారని ఆరోపించారు. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్‌కి అమ్మేయడం కాదు, పనుల్లో ప్రైవేట్ సహకారం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. కాలేజీల నియంత్రణ అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశ్యమని తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్రతి మెడికల్ కాలేజీలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయిస్తామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు అదే కేటాగిరి కింద రూ.15 వేల కేటాయించబడతా యని చెప్పారు. పీపీపీ పద్ధతిని నేషనల్ మెడికల్ కమీషన్ చైర్మన్ డాక్టర్ అభిజాత్ సేట్ సమర్థించారని గుర్తు చేశారు. వైద్య విద్యను ముందుకు తీసుకువెళ్లాలంటే పీపీపీ సరైన దారి అని ఎన్ఎంసీ స్పష్టం చేసిందని వెల్లడించారు.


