దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ)ని కట్టిడిచేసే వ్యాక్సినేషన్ (హెచ్‌పీవీ వ్యాక్సినేషన్) కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ రాజస్థాన్‌లోని అజ్మేర్లో నగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశమంతటా 14 సంవత్సరాల లోపు వయస్సున్న బాలికలకు గార్డాసిల్ అనే టీకాను ఉచితంగా ఇస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, స్కూళ్లలో ఈ టీకాలు వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్‌పీవీ టైప్ 16, 18తోపాటు టైప్ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని కేంద్రం తెలిపింది.


