దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్ లో ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభు యేసుకి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోని కేథడ్రల్ చర్చలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.


