ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. రష్యా పర్యాటకులకు ఉచిత 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉచిత 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని, ఇందుకు ఎలాంటి రుసుము ఉండదని చెప్పారు. త్వరలోనే రష్యా పౌరులకు 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి రుసుము లేకుండానే ఈ వీసాలను ప్రోసెస్ చేస్తాం అని ప్రధాని ప్రకటించారు.


