My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

భారత్‌ పర్యటనకు పుతిన్‌!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, పుతిన్‌ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఇండియా  ఖరారైనట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ ఇటీవలే రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుతిన్‌ భారత పర్యటన తేదీలు ఖరారు చేస్తున్నట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది డిసెంబర్‌ […]

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, పుతిన్‌ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఇండియా  ఖరారైనట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ ఇటీవలే రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుతిన్‌ భారత పర్యటన తేదీలు ఖరారు చేస్తున్నట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది డిసెంబర్‌ 5-6 తేదీల్లో పుతిన్‌ న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు తాజా సమాచారం.

ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పుతిన్‌ భేటీ కానున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా భారీగా టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్‌లతో అమెరికా-భారత్‌ మధ్య దూరం పెరుగుతుండగా, భారత్‌-రష్యా మధ్య బంధం మరింత బలపడుతోంది. ఈ క్రమంలో పుతిన్‌ భారత్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది.2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం అనంతరం ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.