రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, పుతిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ అమెరికాకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు. భారత్కు నిరంతరంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్తో కలిసి నడుస్తామని అన్నారు. టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు భారత్కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చింది. అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య అవగాహన కుదిరింది. విభిన్న అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్-రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది.


