హెచ్ 1బీ వీసాలకు సంబంధించి లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సంతకం చేయడం, ఆ ఉత్తర్వులు ఈనెల 21వ తేదీ నుంచి అమల్లోకి రానుండటంపై విపక్ష కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది. ఈ పరిణామంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ట్రంప్ తొలిసారి దేశధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని ట్రంప్ దృష్టికి తీసుకురాకపోవడంపై మోదీని తాను 2017లోనే ప్రశ్నించానని రాహుల్ గుర్తుచేశారు. మోదీ బలహీన ప్రధాని. మళ్లీ ఇదే మాట చెబుతున్నాను అని రాహుల్ విమర్శించారు.


