చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘బైసన్’. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో నడుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన సూపర్‌స్టార్ రజనీకాంత్ బైసన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ స్వయంగా మారి సెల్వరాజ్‌కు ఫోన్ చేసి అభినందించినట్లు దర్శకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.


