దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ మూడు గంటలపాటూ ఎర్రకోట సమీపంలోని పబ్లిక్ పార్కింగ్ స్థలంలో ఏం చేశాడన్నదానిపై విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉమర్ పార్కింగ్‌లోనే బాంబు తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా పార్కింగ్ స్థలానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను దర్యాప్తు బృందం పరిశీలించింది. డాక్టర్ ఉమర్ 10వ తేదీన మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్ స్థలంలోకి వెళ్లి సాయంత్రం 6:28 గంటలకు బయటకు వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ఆ మూడు గంటలు అతడు కారులోనే ఉండి పేలుడు పదార్థాన్ని తయారు చేసినట్లుగా గుర్తించారు. పార్కింగ్ స్థలంలో ఉన్నంతసేపు ఉమర్ ఒక్కసారి కూడా కారు దిగలేదని దర్యాప్తులో తేలింది.


