ఇండిగో సేవలు స్తంభించాయి. గత ఐదురోజుల్లో 2వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన రీఫండ్ ప్రక్రియను ఆదివారం సాయంత్రం వరకు పూర్తి చేయాలని విమానయాన సంస్థను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం ఆదేశించింది. ప్రయాణీకుల లగేజీని రాబోయే రెండు రోజుల్లో డెలివరీ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ చెప్పింది. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వెయ్యికపైగా విమానాలను రద్దు చేసింది. రీఫండ్ విషయంలో ఆలస్యం జరిగినా, నిబంధనలు పాటించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రద్దయిన, అంతరాయం కలిగిన అన్ని విమానాలకు రీఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


