మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్ముఖ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ రాజా శివాజీ గురించి కీలక ప్రకటన చేశాడు. శివాజీ జయంతి సందర్భంగా అతడికి నివాళులు అర్పిస్తూ, చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు, సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు. రితేష్ దేశ్ముఖ్ స్వయంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తుండగా, రితేష్ భార్య, ప్రముఖ నటి జెనీలియా దేశ్ముఖ్ (ముంబై ఫిల్మ్ కంపెనీ), జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విజువల్స్ ఈ సినిమాకు అందిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ వీరగాథను, ఆయన స్వరాజ్యం కోసం చేసిన పోరాటాన్ని ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఈ చిత్రం 2026 మే 1న (మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. మరాఠీ, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం.


