సహారా గ్రూప్ కంపెనీల భవిష్యత్తుకు సంబంధించి ఓ కీలక పరిణామం చోటు చేసుకున్నది. కంపెనీ పాలసీ మేకర్స్ ఈ గ్రూప్ ఆస్తులను అదానీ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మహారాష్ట్రలోని అంబీ వ్యాలీ, లక్నోలోని షహరా సిటీతో సహా వివిధ ఆస్తులను అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించడానికి అనుమతి కోరుతూ సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 14న విచారణ జరిగే అవకాశం ఉన్నది. న్యాయవాది గౌతమ్ అవస్థి దాఖలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 6 నాటి టర్మ్ షీట్‌లో పేర్కొన్న నిబంధనలు, షరతులపై గ్రూప్ ఆస్తులను అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది సహరా గ్రూప్.


