సిటీలో శాంతి భద్రత కాపాడటమే మా మొదటి కర్తవ్యం అని కొత్త సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ సిటీ సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కంట్రోల్ చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపడతామన్నారు. డ్రగ్స్ మత్తు వదిలిస్తామన్నారు. సైబర్ కేటుగాళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. డబ్బులు ఊరికే ఎవ్వరూ ఇవ్వరు, ప్రజలు సైబర్ మోసాగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్ క్రైం కట్టడికి మరిన్న చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఆన్ లైన్ బెట్టింగ్, ఫేక్ యాప్ పై నిఘా పెంచుతామన్నారు. సిటీలో మహిళ భద్రతకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తామన్నారు. డ్యూటీలో పోలీసులు మరింత అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు.


