పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ 1 నుంచి 19 వరకూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.


