My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

వాలంటైన్స్ కానుక‌గా సీతా పయనం రిలీజ్

అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం సీతా పయనం. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ వెండితెరకు కథానాయికగా పరిచయం అవుతుండటం విశేషం. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించగా, అర్జున్ స్వయంగా ఒక ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. అలాగే ఆయన మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ […]

అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం సీతా పయనం. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ వెండితెరకు కథానాయికగా పరిచయం అవుతుండటం విశేషం. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించగా, అర్జున్ స్వయంగా ఒక ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. అలాగే ఆయన మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కూడా ఈ మూవీలో స్పెషల్ కామియో రోల్‌లో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్ప‌టికే పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకుంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది. జి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా పదునైన డైలాగ్స్ రాశారు. యాక్షన్ కింగ్ సినిమా అంటేనే ఫైట్స్ స్పెషల్‌గా ఉంటాయి కాబట్టి, ఈ చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వినూత్న ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల్లోకి వెళ్తున్న మేకర్స్, త్వరలోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.