మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబియు) ఛాన్సలర్ మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనితో పాటు వివాదానికి సంబంధించిన అనుబంధ పిటిషన్‌ను కూడా కొట్టివేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించారు. కిడ్నాప్ ఘటనకు ముందు ఆ తర్వాత యూనివర్సిటీ పీఆర్వో సతీష్‌తో మోహన్ బాబు నిరంతరం ఫోన్లో మాట్లాడినట్లు, వారిద్దరి మధ్య మెసేజ్‌లు కూడా మారినట్లు పోలీసులు కాల్ డేటా, వాట్సాప్ చాట్ వివరాలను చూపించినట్లు కోర్టు పేర్కొంది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి కేసుకు సంబంధించిన మెయిన్ పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేసు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు.


